కళారాధన సాంస్కృతిక చైతన్య మండలి వార్షికోత్సవం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగింది. కళలు, సంగీతం జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు దోహదపడతాయని సమావేశంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ కవి, గాయకుడు మాలెల అంజిలయ్యగౌడ్ రచించిన ‘జనస్వరాలు-నా స్వరాలు’ జానపద గేయ పుస్తకాన్ని టీఆర్ఎస్ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఏ దేశంలో స్థిరపడ్డా, ఏ రంగంలో ఉన్నా కళలను, సంస్కృతిని మరవొద్దని విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. నిత్య జీవితంలో ఒత్తిడికి గురయ్యేవారికి మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని స్లేట్ స్కూల్ అధినేత వాసిరెడ్డి అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ జీఎం సి.రామకృష్ణ, కళారాధన వ్యవస్థాపక కార్యదర్శి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.